శనివారం 04 జూలై 2020
National - Jun 28, 2020 , 17:14:08

తులిప్‌ బల్బుల శుద్ధి ప్రారంభం

తులిప్‌ బల్బుల శుద్ధి ప్రారంభం

శ్రీనగర్‌: తులిప్ బల్బుల శుద్ధి కార్యకలాపాలు శ్రీనగర్‌లో ఆదివారం ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది తులిప్ షోను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఫ్లోరికల్చర్ విభాగం కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఫ్లోరికల్చర్ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్ ఫరూక్ అహ్మద్ రాథోడ్ మాట్లాడుతూ తులిప్ షో కేవలం నెల రోజుల ఈవెంట్‌ అని తెలిపారు. తోట కార్మికులు, కార్మికులు విశ్రాంతి పొందే సమయం ఇదేనని, వారంతా ఏడాది పొడవునా పని చేస్తారన్నారు. తులిప్ కోత చాలా ముఖ్యమైందని, ఈ కాలంలో పై నుంచి పువ్వులు కత్తిరిస్తారని చెప్పారు. నిర్ధిష్ట సైజులోని బల్బులను సీజన్ కోసం వినియోగించవచ్చన్నారు. అనంతరం గార్డనర్‌ అబ్దుల్ రెహ్మన్ మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో ఈ ఏడాది కోతపై ప్రభావంపై చూపిందన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేత అనంతరం తిరిగి పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. 'క్లీనింగ్ ప్రక్రియలో కెమికల్‌ ట్రీట్‌మెంట్‌ కోల్డ్ స్టోరేజీలో బల్బ్, విత్తనం వేరు చేయడంపై ఇమిడి ఉంటుందని రెహమాన్ పేర్కొన్నారు.


logo