శుక్రవారం 10 జూలై 2020
National - Jun 29, 2020 , 13:58:51

అసోంలో నీటమునిగిన గ్రామాలు

అసోంలో నీటమునిగిన గ్రామాలు

అసోం : కరోనా వ్యాధి వచ్చి ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న అసోం ప్రజలకు వరదలు మరో పెద్ద సమస్యను తెచ్చిపెట్టాయి. అసోంలోని 16 జిల్లాలోకి వరదనీరు ప్రవేశించి సుమారు 2.53 లక్షల మందికి పైగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నారు. అస్సాంలో బాగా దెబ్బతిన్న జిల్లాలుగా టిన్సుకియా, ముజులి, దిబ్రుగ్ర ఉన్నాయి. లక్షల ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నాయి. 


టిన్సుకియా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ ‘‘ రెండు రోజుల పాటు గ్రామం మొత్తం మునిగిపోయింది.  ప్రభుత్వం, పరిపాలన సిబ్బంది మాకు ఎలాంటి సహాయం అందించడం లేదు. మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అక్కడ 125 ఇండ్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. సుమారు 15 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందరం సహాయం కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నాం. మర బోటుల్లో జనాలను సురక్షిత ప్రాంతాలకు మేమే తరలిస్తున్నాం. రెస్య్కూ టీం చేయాల్సిన పనులు మేమే చేసుకుంటున్నాం’’ అని తెలిపాడు.  అంఫన్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండడంతో ఈ వరదలు వస్తున్నాయి. 


logo