శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 15:04:45

అసోం వ‌ర‌ద‌లు.. 71కి చేరిన మృతులు

అసోం వ‌ర‌ద‌లు.. 71కి చేరిన మృతులు

గువాహ‌టి: ఈశాన్య రాష్ట్రం అసోంలో వ‌ర‌ద‌ల ప్ర‌భావం కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌వ‌ల్ల ఆ రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. ఈ వ‌ర‌ద‌ల‌వ‌ల్ల ప్ర‌మాదాల‌కు గురై వేర్వేరుచోట్ల మొత్తం 71 మంది మృతిచెందారు. వారిలో 26 మంది కొండ‌చరియ‌లు విరిగిప‌డ‌టం కార‌ణంగా మృతిచెందినవారు ఉన్నారు. ఈ వ‌ర‌ద‌లు మొత్తం 27 జిల్లాలను తీవ్రంగా ప్ర‌భావితం చేశాయ‌ని అసోం స్టేట్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) తెలిపింది. 

అసోంలో మొత్తం 122 రెవెన్యూ స‌ర్కిళ్లలో వ‌ర‌ద‌ల ప్ర‌భావం తీవ్రంగా ఉంద‌ని ASDMA అధికారులు చెప్పారు. మొత్తం 4,766 గ్రామాలకు చెందిన 40 ల‌క్ష‌ల‌ మందికిపైగా ప్రజ‌లపై వ‌ర‌ద‌ల ప్ర‌భావం ప‌డింద‌న్నారు. కాగా, ముంపు ప్రాంతాల్లో బాధితుల కోసం ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బ‌ల‌గాలు రంగంలోకి దిగి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఆవాసాలు కోల్పోయిన వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నాయి. వ‌ర‌ద‌ల బాధితుల కోసం అధికారులు రాష్ట్ర‌వ్యాప్తంగా 445 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.  వెల్ల‌డించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo