సోమవారం 06 జూలై 2020
National - May 31, 2020 , 10:57:49

మైనర్‌ భుజాలపై ప్రేమికుడు.. ఊరేగిస్తూ చితకబాదారు

మైనర్‌ భుజాలపై ప్రేమికుడు.. ఊరేగిస్తూ చితకబాదారు

వడోదర : ఓ మైనర్‌ పట్ల తన మేనమామలు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. కర్రలతో చితకబాదారు. ఆమె భుజాలపై ప్రేమికుడిని ఎక్కించి ఊరంతా ఊరేగించారు. ఈ అమానవీయ ఘటన గుజరాత్‌లోని ఛోటా ఉదేపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో రెండు రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

ఓ 16 ఏళ్ల అమ్మాయిని.. 20 ఏళ్ల యువకుడు ప్రేమిస్తున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని బయటకు తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి మేనమామలు.. ఆమెను ఊరికి తీసుకువచ్చారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే కర్రలతో చితకబాదారు. అంతటితో ఆగకుండా.. ప్రేమికుడిని ఆమె భుజాలపై ఎక్కించి ఊరేగించారు. ఈ దృశ్యాలను కొందరు తమ మొబైల్స్‌లో చిత్రీకరించి.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు.

ఈ వీడియోలు పోలీసుల దాకా చేరడంతో.. వారు స్పందించి కేసు నమోదు చేశారు. బాలికను చితకబాదిన మేనమామలతో పాటు, ఆమె ప్రేమికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 


logo