శనివారం 04 జూలై 2020
National - Jun 25, 2020 , 11:14:31

ఇప్పుడు తెలుగులోనూ ఫ్లిప్‌కార్ట్‌!

ఇప్పుడు తెలుగులోనూ ఫ్లిప్‌కార్ట్‌!

ప్ర‌ముఖ ఈ కామర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ మ‌రో ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్ర‌జ‌ల‌కు ఎంతో అందుబాటులో ఉన్న ఈ వెబ్‌సైట్ ఇప్ప‌టివ‌ర‌కు హిందీ, ఇంగ్లీష్ భాష‌లు మాత్ర‌మే క‌లిగి ఉన్న‌ది. కొత్త‌గా అంద‌రికీ అర్థ‌మ‌య్యే రీతిలో చేప‌ట్టాల‌ని తెలుగుతో స‌హా 3 ప్రాంతీయ భాష‌ల్లో త‌మ పోర్ట‌ల్‌ను తీసుకువ‌చ్చింది.

హిందీ, ఇంగ్లీష్ భాష‌ల‌కే ప‌రిమిత‌మైన పోర్ట‌ల్‌ ఈ మూడు లాంగ్వేజ్‌ల‌ను కూడా చేర్చారు. ఈ నిర్ణ‌యం వ‌ల్ల వివిధ ప్రాంతీయ భాష‌ల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్ల ఈజీగా వ‌స్తువులు కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని ఫ్లిప్‌కార్ట్ ప్ర‌క‌టించింది. 


logo