మంగళవారం 19 జనవరి 2021
National - Jan 02, 2021 , 16:36:25

ఈ నెల 6 నుంచి యూకేకు విమానాలు

ఈ నెల 6 నుంచి యూకేకు విమానాలు

న్యూఢిల్లీ: ఇండియా నుంచి యూకేకు ఈ నెల 6 నుంచి విమానాలు తిరిగి ప్రారంభం కానున్న‌ట్లు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్ పూరి వెల్ల‌డించారు. అయితే యూకే నుంచి ఇండియాకు వ‌చ్చే విమానాలు మాత్రం ఈ నెల 8 నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని చెప్పారు. వారానికి మొత్తం 30 విమానాలు రాక‌పోక‌లు సాగిస్తాయ‌ని, ఇందులో ఇండియా, యూకే చెరో 15 విమానాలు న‌డుపుతాయ‌ని తెలిపారు. జ‌న‌వ‌రి 23 వ‌ర‌కూ ఇదే షెడ్యూల్ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ల నుంచి మాత్ర‌మే యూకేకు విమాన రాక‌పోక‌లు ఉంటాయ‌ని కూడా హ‌ర్దీప్ సింగ్ స్ప‌ష్టం చేశారు.