శుక్రవారం 05 జూన్ 2020
National - May 09, 2020 , 16:49:30

వందేభార‌త్‌.. వివిధ దేశాల నుంచి త‌ర‌లింపు ప్రారంభం

వందేభార‌త్‌.. వివిధ దేశాల నుంచి త‌ర‌లింపు ప్రారంభం

హైద‌రాబాద్‌: వందేభార‌త్ మిష‌న్‌ను భార‌త్ నిర్విఘ్నంగా కొన‌సాగిస్తున్న‌ది. విదేశాల్లో చిక్క‌కున్న వారిని విమానాల్లో స్వ‌దేశానికి తీసుకువ‌స్తున్నారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అయితే వివిధ కార‌ణాల వ‌ల్ల వివిధ దేశాల్లో చిక్కుకున్న వారి త‌ర‌లింపు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.  బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకా నుంచి 129 ప్ర‌యాణికుల‌తో బ‌య‌లుదేరిన విమానం ఢిల్లీ చేరుకున్న‌ది.  అక్క‌డ ఆ ప్ర‌యాణికులకు స్క్రీనింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఇవాళ ఉద‌యం ఢాకాలో.. భార‌తీయుల‌కు అక్క‌డ అధికారులు అన్ని ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. ఎయిర్ ఇండియా ఫ్ల‌యిట్ ద్వారా వారంతా స్వ‌దేశం చేరుకున్నారు.  

మ‌లేషియాలోని కౌలాలంపూర్ నుంచి భార‌త్‌కు ఓ విమానం రానున్న‌ది. కౌలాంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో భార‌తీయులకు థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేప‌ట్టారు. ఆవిమానంలో వ‌స్తున్న వారంతా త‌మిళ‌నాడులోని తిరుచిలో దిగ‌నున్నారు.  లండ‌న్ నుంచి ఫ‌స్ట్ ఫ్ల‌యిట్‌కు ఏర్పాట్లు పూర్తిగా జ‌రిగాయి.  లండ‌న్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ముంబై చేరుకోనున్న‌ది. ప్ర‌స్తుతం అక్క‌డ ప్ర‌యాణికుల స్క్రీనింగ్ ప్ర‌క్రియ జ‌రుగుతున్న‌ది. భార‌త హైక‌మిష‌న్‌కు అభ్య‌ర్థ పెట్టుకున్న త‌ర్వాత త‌న‌కు ఫ్ల‌యిట్ ఎక్కే అవ‌కాశం దొరికింద‌ని ఓ వ్య‌క్తి తెలిపాడు. త‌ర‌లింపు ప్ర‌క్రియ ఇంత త్వ‌ర‌గా జ‌రుగుతుంద‌నుకోలేద‌న్నాడు. 

ఇక గ‌ల్ఫ్ దేశం మ‌స్క‌ట్ నుంచి కూడా కేర‌ళ‌లోని కొచ్చికి ప్ర‌త్యేక విమానం బ‌య‌లుదేర‌నున్న‌ది.  ప్ర‌స్తుతం మ‌స్క‌ట్‌లో స్క్రీనింగ్ నిర్వ‌హిస్తున్నారు.  త‌న ప్ర‌యాణం కోసం స‌హ‌కరించిన ఇండియ‌న్ ఎంబ‌సీకి ఓ యువ‌తి థ్యాంక్స్ చెప్పింది.  కంటికి గాయ‌మైన ఓ వ్య‌క్తి కూడా ఇండియాకు వ‌స్తున్నాడు. మ‌స్క‌ట్ డాక్ట‌ర్లు త‌న కంటికి ఆప‌రేష‌న్ చేసేందుకు నిరాక‌రించిన‌ట్లు తెలిపాడు. మ‌స్క‌ట్ ఫ్ల‌యిట్‌లో సుమారు 177 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా వేలాది మంది ఎన్ఆర్ఐల‌ను త‌ర‌లించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్లాన్ చేసింది.
logo