బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 10:03:27

బిష్కెక్‌ టూ ఇండోర్‌.. స్వదేశానికి చేరిన విద్యార్థులు

బిష్కెక్‌ టూ ఇండోర్‌.. స్వదేశానికి చేరిన విద్యార్థులు

ఇండోర్‌ : కిర్గిజిస్థాన్‌ బిష్కెక్‌ నుంచి 145 మంది భారతీయులతో కూడి ఏయిర్‌ ఇండియా విమానం బుధవారం రాత్రి ఇండోర్‌లోని దేవి అహిల్యాబాయి హోల్కర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. ఇందులో 146 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 145 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా కిర్గిజిస్థాన్‌లో చదువుకునేందుకు వెళ్లారు. ఇందులో ఒక ప్రయాణీకుడిని ఢిల్లీకి తరలించారు. ఇక్కడికి వచ్చిన వారిలో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని కరోనా వైరస్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అమిత్‌ మలకర్‌ చెప్పారు. ప్రయాణికులంతా 14 రోజుల క్వారంటైన్‌లో ఉంటారన్నారు. ఎయిర్‌ పోర్టుకు చేరిన వారదరికీ ఆరోగ్యశాఖ పరీక్షలు చేసిందని వివరించారు. కాగా, విద్యార్థులను తీసుకువెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా భోపాల్‌కు చెందిన అబ్దుల్‌ సత్తార్‌ మాట్లాడుతూ ‘నా ఇద్దరు కుమార్తెలు ఎంబీబీఎస్‌ పూర్తి చేసి తిరిగి వస్తున్నారని తెలిపారు. దాదాపు ఐదేళ్లు అక్కడ మెడిసన్‌ చదువుతున్నారని, ప్రతి సంవత్సరం జూన్‌లో ఇంటికి వస్తారని, ఈ సారి కరోనాతో రాలేకపోయారన్నారు. కరోనా మహమ్మారి కారణంగా విమాన ప్రయాణాలపై ఆంక్షల కారణంగా వివిధ విదేశాల్లో చిక్కుకున్న చిక్కుకున్న భారతీయ పౌరులను తరలించే లక్ష్యంతో భారత ప్రభుత్వ ‘వందే భారత్’ మిషన్ ఐదో దశ వచ్చే నెల ఆగస్టు 1న ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వం మే 7న మిషన్‌ను ప్రారంభించగా, ప్రస్తుతం నాల్గో దశ నడుస్తుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo