గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 17:19:52

కరోనా రోగుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు ఫ్లాష్‌ మాబ్‌

కరోనా రోగుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు ఫ్లాష్‌ మాబ్‌

బెంగళూరు : కరోనా రోగుల్లో మనోస్థైర్యాన్ని పెంచడానికి గాను కరోనా వార్డులో హెల్త్‌కేర్ కార్మికులు డ్యాన్స్ ఫ్లాష్ మాబ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సంఘటన కర్ణాటకలోని విజయనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరిగింది.

వార్తా సంస్థ ANI ఈ విడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. వీడియోలో 1999 కన్నడ చిత్రం ఉపేంద్రలోని మస్తు మస్తు హుడుగి బండలు పాటకు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు నృత్యం చేస్తున్నారు. హెల్త్‌కేర్ నిపుణులతో పాటు, కొందరు అసింప్టోమాటిక్ కరోనా రోగులు కూడా ఈ ఫ్లాష్ మాబ్‌లో పాల్గొన్నారు. సుమారు 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో చాలా మంది మాస్కులు ధరించి, ఒకే రకమైన స్టెప్పులు వేస్తూ ఆనందంగా నృత్యం చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే లక్షల్లో లైకులు, వ్యూస్‌ వచ్చిపడ్డాయి. 

ఉత్తర ప్రదేశ్ పోలీసు అధికారి రాహుల్ శ్రీవాస్తవ్ ఇలాంటిదే ఇంకో వీడియోను షేర్‌ చేశారు. గత నెల బీహార్‌లోని సివాన్‌లోని జుఫార్ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న వారు డ్యాన్స్‌ చేస్తున్నట్టు ఈ వీడియోలో ఉంది.  వారు 1997లో ప్రసిద్ధమైన బోర్డర్ చిత్రం సాండీస్ ఆట్ హై అనే పాటకు నృత్యం చేశారు.


logo