శనివారం 11 జూలై 2020
National - Jun 30, 2020 , 15:43:37

24గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

24గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో గడిచిన 24గంటల వ్యవధిలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు, పోలీసులు హతమార్చినట్లు కశ్మీర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ తెలిపారు. అనంతనాగ్‌ జిల్లాలోని వాఘమా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. సోమవారం సాయంత్రం ఇదేప్రాంతంలో ముగ్గురు మిలిటెంట్లు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. భద్రతా దళాలతోపాటు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, పోలీసులు  కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించి వారిని కాల్పుల్లో తుదముట్టించారు. మృతి చెందిన ముగ్గురిలో ఒకరిని జమ్ముకశ్మీర్‌ ఇస్లామిక్‌ ఫోర్స్‌‌ కమాండర్‌ (జేకేఐఎఫ్‌) జహిద్‌ దార్‌గా గుర్తించామని కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.  


logo