గురువారం 02 జూలై 2020
National - Jun 23, 2020 , 15:38:44

అధికార పార్టీలో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలు

అధికార పార్టీలో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలు

పాట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీహార్‌లో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ)కి చెందిన ఐదుగురు శాసన మండలి సభ్యులు అధికార జనతా దళ్ యూనైటెడ్‌ (జేడీయూ)లో మంగళవారం చేరారు. వారిని తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని జేడీయూ నేత రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ తెలిపారు.

బీహార్‌లో ప్రభుత్వ పాలన నవంబర్‌ 29తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్డీయే నేతృత్వంలోని జేడీయూ, యూపీఏ నేతృత్వంలోని ఆర్జేడీ మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నది. ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే ఉండటంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. logo