గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 14:27:31

రాఫెల్స్‌కు ర‌క్ష‌ణ‌గా.. సుఖోయ్ యుద్ధ విమానాలు

రాఫెల్స్‌కు ర‌క్ష‌ణ‌గా.. సుఖోయ్ యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ నుంచి భార‌త్ చేర‌నున్న అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల‌కు ర‌క్ష‌ణ‌గా రెండు ఎస్‌యూ 30ఎంకేఐ యుద్ధ విమానాలు ఉన్నాయి. మ‌రోవైపు రాఫెల్స్‌కు ఐఎన్ఎస్ కోల్‌క‌తా యుద్ధ నౌక స్వాగ‌తం ప‌లికింది. బుధ‌వారం ఉద‌యం యూఏఈ నుంచి బ‌య‌లు దేరిన రాఫెల్స్ యుద్ధ విమానాల పైల‌ట్‌తో అరేబియా స‌ముద్రంలో ఉన్న ఐఎన్ఎస్ కోల్‌క‌తా నౌక కెప్టెన్ మాట్లాడారు. భార‌త స‌ముద్ర జ‌లాల్లోకి స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. మీ కీర్తి ఆశాకాన్ని తాకాల‌ని ఆకాంక్షించారు. అంబాలా ఎయిర్‌బేస్‌లో సంతోషంగా ల్యాండ్‌కావాల‌ని తెలిపారు. రాఫెల్స్ టీం లీడ‌ర్ పైల‌ట్ దీనికి ప్ర‌తిస్పందించారు. స‌ముద్రంలో గ‌స్తీ నిర్వ‌హిస్తున్న ఐఎన్ఎస్ కోల్‌క‌తాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 


 


 


logo