శనివారం 28 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 14:45:25

ప్లాస్టిక్ ఫ్యాక్ట‌రీలో పేలుడు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

ప్లాస్టిక్ ఫ్యాక్ట‌రీలో పేలుడు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. మాల్దా జిల్లా సుజాపూర్ ఏరియాలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్ట‌రీలో ఈ ఉద‌యం 11 గంట‌ల‌కు భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో ప‌నిచేస్తున్న ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. 

గాయ‌ప‌డ్డ వారిని పోలీసులు చికిత్స నిమిత్తం మాల్దా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన‌వారి పరిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. పేలుడుకుగ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌న్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.