బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 23:01:06

కేరళలో మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌..

కేరళలో మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌..

తిరువనంతపురం: కేరళలో మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశవ్యాప్తంగా కరోనా(కొవిద్‌-19) కేసుల సంఖ్య 39కి చేరింది. కాగా, కేరళలో నమోదైన ఐదు కేసులు ఒకే కుటుంబానికి చెందినవి కావడం దిగ్భ్రాంతికి గురిచేసే అంశం. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ వెల్లడించారు. జలుబు లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మంత్రి తెలిపారు. వారిని ఐసోలేషన్‌ వార్డులో, వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని ఆమె వెల్లడించారు. వారిలో ముగ్గురు సభ్యులు ఇటీవల ఇటలీ నుంచి వచ్చినట్లు మంత్రి తెలిపారు. వారి నుంచి మగితా ఇద్దరికి కూడా వైరస్‌ వ్యాపించినట్లు మంత్రి శైలజ తెలిపారు. కాగా, రాష్ట్రంలో కరోనా వ్యాపించకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. 


logo