సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 22, 2020 , 10:14:37

గ‌న్‌ల‌తో బెదిరించి.. బ్యాంకులో 7 ల‌క్ష‌ల దోపిడీ : వీడియో

గ‌న్‌ల‌తో బెదిరించి.. బ్యాంకులో  7 ల‌క్ష‌ల దోపిడీ :  వీడియో

హైద‌రాబాద్‌: హ‌ర్యానాలో బుధ‌వారం బ్యాంక్ దోపిడీ జ‌రిగింది.  అయిదుగురు వ్య‌క్తులు గ‌న్‌ల‌తో వ‌చ్చి.. బ్యాంకును లూటీ చేశారు.  జాజ‌ర్ జిల్లాలోని మాచ్‌రౌలీ గ్రామంలో ఉన్న పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులోకి ప్ర‌వేశించిన సాయుధులు బ్యాంకు అధికారుల్ని బెదిరించి.. ఏడు ల‌క్ష‌ల న‌గ‌దును ఎత్తుకెళ్లారు.  బ్యాంకు సెక్యూర్టీ గార్డు వ‌ద్ద ఉన్న గ‌న్‌ను కూడా అప‌హ‌రించారు.  అయితే దోపిడీ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసు విచార‌ణ మొదలుపెట్టారు.  ఇద్ద‌రు డీఎస్పీ ర్యాంకు ఆఫీస‌ర్లు ఈ కేసును ప‌రిశీలిస్తున్నారు.