శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 24, 2020 , 11:17:41

ఒడిశాలో ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోలు హతం

ఒడిశాలో ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోలు హతం

భువనేశ్వర్‌ : ఒడిశాలో నిన్న సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. కందమాల్‌ జిల్లా సకేళి అడవిలో గురువారం పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. సాయంత్రం సమయంలో పోలీసులకు, మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


logo