శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Feb 23, 2021 , 15:21:20

బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి

బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి

ఔరంగాబాద్‌ : మహారాష్ట్రలోని అహ్మాద్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ నుంచి దూసుకెళ్లి అవతలి వైపు నుంచి వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్‌తోపాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పుణే-ఔరంగాబాద్‌ రహదారిపై దేవగడ్ ఫతా వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. 

జల్నా జిల్లాలోని మంథా ప్రాంతానికి చెందిన ఐదుగురు ఓ వివాహ వేడుకకు హాజరై అనంతరం షిరిడీని దర్శించుకొని కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. దేవగడ్‌ ఫతా వద్దకు రాగానే డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి డివైడర్‌ నుంచి దూసుకెళ్లి బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కైలాశ్‌ నౌరు (32), రమేశ్‌ గుగే (40), విష్ణు చవాన్‌ (30), నారాయణ్‌ వర్కడ్ (25), శంతను కక్డేకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు నిర్దారించారు.   


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo