బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 23, 2020 , 16:49:24

పటాకుల పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

పటాకుల పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

విరుదునగర్‌ : తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. పటాకుల పరిశ్రమలో పేలుడు సంభవించి ముగ్గురు మహిళలతో సహా ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.  ఎరిచ్చనత్తం పరిధిలోని ఎం.సెన్‌గులం గ్రామంలోగల రాజ్యలక్ష్మి ఫైర్‌వర్క్స్‌ పరిశ్రమలో శుక్రవారం కూలీలంతా ఫ్యాన్సీ రకం పటాకుల తయారీలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం ఒక్కసారిగా పరిశ్రమలో పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి.

పరిశ్రమలో రసాయనాల కారణంగానే ప్రమాదం సంభవించిందని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండుగంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎరిచ్చనత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.