ఐదుగురి ప్రాణాలు తీసిన ఫుట్‌బోర్డు ప్రయాణం..

తంజావూర్ : తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఐదుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికిపైగా గాయాలయ్యాయి. తంజావూర్ జిల్లా తిరువయ్యార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. గ్రాండ్ అనైకట్ (కల్లనై) నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో తంజాపూర్ బయల్దేరింది. తిరువయ్యార్ వద్ద డ్రైవర్ ట్రక్కును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లడంతో విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా బస్సు విద్యుదాఘాతానికి గురైంది.
దీంతో ఫుట్‌బోర్డుపై కూర్చున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుకట్టుప్పల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఆ ఆరోపణలు క్రేజీగా ఉన్నాయి: బిల్ గేట్స్
- ప్రియురాలితో గొడవపడి సముద్రంలో దూకిన యువకుడు
- పల్లె ప్రకృతివనం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించిన మంత్రి
- యాదాద్రి పనుల తీరుపై మంత్రి అసంతృప్తి.. అధికారులపై ఆగ్రహం
- గంగూలీకి మళ్లీ ఛాతీలో నొప్పి
- కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర బుక్ రిలీజ్
- ముష్కరుల దాడి.. నలుగురు జవాన్లకు గాయాలు
- ఐపీఎల్-2021 మినీ వేలం తేదీ, వేదిక ఖరారు
- థాంక్యూ ఇండియా : నేపాల్ ప్రధాని ఓలీ
- ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లు దాటిన కోవిడ్ కేసులు