శుక్రవారం 05 జూన్ 2020
National - May 08, 2020 , 06:50:34

గల్ఫ్‌ నుంచి వచ్చిన వారిలో ఐదుగురు ఐసోలేషన్‌కు తరలింపు

గల్ఫ్‌ నుంచి వచ్చిన వారిలో ఐదుగురు ఐసోలేషన్‌కు తరలింపు

కేరళ : వందే భారత్‌ మిషన్‌లో భాగంగా అబుదాబి నుంచి 181 మంది నిన్న కేరళలోని కొచ్చికి చేరుకున్నారు. కాగా వీరందరికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించడంతో ఐదుగురికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో బాధితులను జిల్లా ఆస్పత్రి అలూవాలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అబుదాబి నుంచి వచ్చిన 181 మందిలో 49 మంది గర్బిణిలు, నలుగురు పిల్లలు ఉన్నారు. వీరిని హోం క్వారంటైన్‌కు తరలించారు. కాగా మిగిలిన అందరిని ఆయా జిల్లాలోని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. 14 రోజుల క్వారంటైన్‌ అనంతరం వీరికి మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నారు.


logo