గురువారం 16 జూలై 2020
National - Jun 27, 2020 , 19:22:35

బీజేపీలో చేరిన ఐదుగురు మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

బీజేపీలో చేరిన ఐదుగురు మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

గాంధీనగర్‌ : గుజరాత్‌ రాష్ట్రంలోని ఐదుగురు మాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు జేవీ కాకడియా, జితు చౌదరి, బ్రిజేశ్‌ మీరజ్‌, ప్రద్యూమ్నసింగ్‌ జడేజా, అక్షయ్‌ పటేల్‌ తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. జూన్‌ 4న ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అక్షయ్‌ పటేల్‌, జితు భాయ్‌ చౌదరి స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేసినట్లు గుజరాత్‌ శాసనసభ స్పీకర్‌ రాజేంద్రసింగ్‌ త్రివేది తెలిపారు. మరుసటి రోజు బ్రిజేశ్‌ మీరజ్‌ కూడా తన రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించారు. ఈ రాజీనామాలు రానున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


logo