ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 21:22:22

బాత్‌రూంలో ఐదడుగుల కొండచిలువ

బాత్‌రూంలో ఐదడుగుల కొండచిలువ

న్యూ ఢిల్లీ : ఐదు అడుగుల పొడవైన కొండచిలువ భారీ వర్షాల కారణంగా ఢిల్లీ నగరం ఓఖ్లా ప్రాంతంలోని ఒక ఇంటి బాత్‌రూంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేసింది. వెంటనే అప్రమత్తమై వైల్డ్‌లైఫ్‌ ఎన్జీఓను సంప్రదించడంతో రెస్క్యూ టీం కొండచిలువను తీసుకెళ్లారు. పాము అలసిపోయిన స్థితిలో ఉందని, ప్రస్తుతం దాన్ని పరిశీలిస్తున్నామని ఎన్జీఓ తెలిపింది. వర్షపు నీరు పాము నివాసాన్ని ముంచెత్తడంతో భయపడి అది ఒక ఆలయంలోకి ప్రవేశించిందని రెస్క్యూ టీం వివరించింది. ఆలయంలోని ఒక మూలలో అది వంకరగా ఉండటం చూసి షాక్ అయిన పూజారి వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్‌ను సంప్రదించాడు. 

వర్షాలు పడడంతో పాములు బోరియల్లో నుంచి బయటకు వస్తాయని వైల్డ్ లైఫ్ ఎస్‌ఓఎస్‌కు చెందిన వసీం అక్రమ్ తెలిపారు. వర్షపు నీరు వాటి సహజ ఆవాసాల్లోకి చేరడంతో అవి సురక్షితమైన, పొడి వాతావరణంలోకి ప్రవేశిస్తాయని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo