గురువారం 28 జనవరి 2021
National - Nov 29, 2020 , 06:49:07

మందుపాతర పేలి ఐదుగురు జవాన్లకు గాయాలు

మందుపాతర పేలి ఐదుగురు జవాన్లకు గాయాలు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మందుపాతర పేలడంతో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని చింతఫుగా అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా 206 బెటాలియన్‌ జవాన్లు, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు సంయుక్తంగా నిన్న సాయంత్రం మావోయిస్టులకోసం గాలింపు చేపట్టారు. ఈక్రమంలో తాడ్మెట్ల వద్ద అప్పటికే అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో  కోబ్రా బెటాలియన్‌లోని ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని ప్రత్యేక హెలీకాప్టర్‌లో దవాఖానకు తరలించామని, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ప్రకటించారు.


logo