శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 14:27:56

సరిహద్దులో ఐదుగురు బంగ్లాదేశీయులు సహా 12 మందిని పట్టుకున్న సైన్యం

సరిహద్దులో ఐదుగురు బంగ్లాదేశీయులు సహా 12 మందిని పట్టుకున్న సైన్యం

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ నాడియా జిల్లాలోని ఇండో- బంగ్లా సరిహద్దును అక్రమంగా దాటినందుకు ఐదుగురు బంగ్లాదేశీయులు సహా వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది భారతీయ పౌరులను సరిహద్దు భద్రతా దళ సిబ్బంది పట్టుకున్నారని పారామిలిటరీ ఫోర్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రామ్‌నగర్‌ అవుట్‌ పోస్ట్‌ సమీపంలో అక్రమంగా దేశంలోకి వస్తుండగా ఐదుగురిని పట్టుకున్నామని, వారంతా కార్మికులుగా పని చేసేందుకు బెంగళూరుకు వెళ్తున్నట్లు బీఎస్‌ఎఫ్‌ పేర్కొంది. కాగా, అరెస్ట్‌ చేసిన భారతీయులు బంగ్లాలోని తమ బంధువులను కలిసేందుకు వెళ్లి తిరిగి బెనపోల్‌ ప్రాంతంలో సరిహద్దు దాటడానికి వచ్చారని అంగీకరించారని చెప్పింది. పట్టుకున్న వారందరినీ హన్స్‌ఖాలీ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు పేర్కొంది. మరో సంఘటనలో ఓ భారతీయుడుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఖాస్మహల్‌ అవుట్‌ పోస్ట్‌ వద్ద బంగ్లా నుంచి అక్రమంగా పశువులను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ పశువుల విలువ స్థానిక మార్కెట్‌లో రూ.2.25లక్షల వరకు ఉంటుందని సైన్యం పేర్కొంది. ( చూడండి..మోతాదు మించితే విషమే.. వీడియో )


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.