మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 08:25:59

పెళ్లి ఊరేగింపుతో వరుడితో సహా ఐదుగురి అరెస్టు

పెళ్లి ఊరేగింపుతో వరుడితో సహా ఐదుగురి అరెస్టు

భువనేశ్వర్ : కరోనా నిబంధనలను ఉల్లంఘించి పెళ్లి ఊరేగింపు జరిపినందుకు వరుడితో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో జరిగింది. ఓ పెళ్లి ఊరేగింపులో కనీసం మాస్క్ లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా డ్యాన్సులు చేశారు. ఈ నెల 2న జరిగిన ఊరేగింపు వీడియోను  సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది  వైరల్‌గా మారింది. దీనిని తీవ్రంగా పరిగణించిన జిల్లా అధికారులు పెళ్లి జరిగిన హోటల్ మై ఫెయిర్ ను సీజ్‌ చేశారు.

వరుడితోపాటు వరుడి తండ్రి, అతని ముగ్గురు మామయ్యలను అరెస్టు చేసి, ఊరేగింపులో పాల్గొన్న రెండు వాహనాలను సీజ్ చేశామని గంజాం ఎస్పీ పినాక్ మిశ్రా చెప్పారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనపై ఐపీసీ సెక్షన్ 188, 269, 270 ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 34 కింద కేసు నమోదు చేశామని ఎస్పీ వివరించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo