బుధవారం 20 జనవరి 2021
National - Dec 04, 2020 , 16:03:29

మొద‌టి వ్యాక్సిన్‌.. కోటి మంది ఆరోగ్య కార్య‌కర్త‌ల‌కు: కేంద్రం

మొద‌టి వ్యాక్సిన్‌.. కోటి మంది ఆరోగ్య  కార్య‌కర్త‌ల‌కు: కేంద్రం

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను మొద‌ట‌గా దేశంలోని కోటి మంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శుక్ర‌వారం జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో అన్ని పార్టీల‌కు ప్ర‌భుత్వం స‌మాచారం ఇచ్చింది. ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల త‌ర్వాత క‌రోనాపై పోరాటం చేస్తున్న పోలీసులు, మున్సిప‌ల్ వ‌ర్క‌ర్లు వంటి 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు ఇవ్వ‌నున్నారు. ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ ప్రెజెంటేష‌న్ ఇచ్చారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సెక్టార్‌లో ఉన్న డాక్ట‌ర్లు, న‌ర్స్‌ల‌కు మొద‌ట వ్యాక్సిన్ ఇవ్వ‌నున్న‌ట్లు ఈ ప్రెజెంటేష‌న్‌లో భాగంగా రాజేష్ భూష‌ణ్ వెల్ల‌డించిన‌ట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. ప్ర‌ముఖ పార్టీల‌కు చెందిన 13 మంది నేత‌లు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. 


logo