శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 05, 2021 , 16:54:15

జ‌న‌వ‌రి 13నే తొలి టీకా‌!

జ‌న‌వ‌రి 13నే తొలి టీకా‌!

న్యూఢిల్లీ: ఇండియాలో తొలి క‌రోనా వైర‌స్ టీకా జ‌న‌వ‌రి 13న వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్ర‌ధానంగా నాలుగు ప్రైమ‌రీ వ్యాక్సిన్ స్టోర్లు ఉన్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పారు. వీటిని జీఎంఎస్‌డీగా పిలుస్తార‌ని, ఇవి క‌ర్నాల్‌, ముంబై, చెన్నై, కోల్‌క‌తాల‌లో ఉంటాయ‌ని తెలిపారు. మొత్తంగా దేశంలో 37 వ్యాక్సిన్ స్టోర్లు ఉంటాయ‌ని వెల్ల‌డించారు. ఈ స్టోర్లు భారీ సంఖ్య‌లో వ్యాక్సిన్‌ను నిల్వ చేస్తాయ‌ని, అక్క‌డి నుంచి వాటిని పంపిణీ చేస్తార‌ని రాజేష్ భూష‌ణ్ తెలిపారు. ఆయా స్టోర్ల‌లో ఎన్ని వ్యాక్సిన్లు ఉన్నాయి, ఏ ఉష్ణోగ్ర‌త ద‌గ్గ‌ర వాటిని స్టోర్ చేశార‌న్న వివ‌రాలు డిజిట‌ల్ రూపంలో ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. 


logo