శనివారం 16 జనవరి 2021
National - Dec 29, 2020 , 15:59:10

అబాకస్ చాంపియన్ షిప్ లో తెలంగాణ విద్యార్థికి మొదటి స్థానం

  అబాకస్ చాంపియన్ షిప్ లో తెలంగాణ విద్యార్థికి మొదటి స్థానం

చెన్నై: భారతదేశ అతిపెద్ద ఎడ్యుటెక్ సంస్థ స్కూల్ లెర్నింగ్ యాప్ అయిన బైజూస్  విద్యార్థులలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వినూత్నపోటీ నిర్వహించింది.ఈ పోటీలో తెలంగాణకు చెందిన పదేండ్ల అనంత రిత్విక్ తన సత్తా చాటాడు.  అబాకస్ లో అపూర్వ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. చెన్నైలోజరిగిన అబాకస్ 2019లో రిత్విక్ రాష్ట్రస్థాయిలో చాంపియన్ గానూ, జాతీయస్థాయిలోసెకండ్ రన్నరప్ గా నిలిచాడు. ఆరో తరగతి చదువుతున్న రిత్విక్ గణితంలో మేటి. తనప్రాక్టీస్ కోసం బైజూస్ ను మా ర్గదర్శిగా ఎంచుకున్నాడు. విజయం సాధించేందుకు గాను ప్రతీ భావననూ చక్కగా అర్థం చేసుకున్నాడు. ఆన్ లైన్ లెర్నింగ్ అనేది విద్యార్థులు విద్య నేర్చుకునేవిధానాన్నిపూర్తిగా మార్చివేసింది. సంప్రదాయక విధానాలకు భిన్నంగా ఆన్ లైన్లెర్నింగ్ లో వివిధ భావనలను సరళంగా, సులభంగా, ప్రభావపూర్వక విధానంలో వివరిస్తారు. విద్యార్థులు అభ్యసనాన్ని ఇష్టపడేలా చేయడంలో వారికి తోడ్పడాలనుకుంటోంది బైజూస్.

విద్యార్థుల నైపుణ్యస్థాయి ఆధారంగా వారికి వ్యక్తిగతీకృత అభ్యసన అనుభూతులనుఅందించడం ద్వారా నిమగ్నతాపూర్వక, ప్రభావశీలక అభ్యసన అనుభూతిని అందిస్తున్నది. అదేవిధంగా, చిన్న వయస్సులోనే రిత్విక్ అబాకస్ పై ఆసక్తి పెంచుకున్నాడు. 11 లెవల్స్ లోఇప్పటికే 9 లెవల్స్ లో నైపుణ్యాలు సాధించాడు. అంతేగాకుండా బైజూస్ విద్యార్థులకువారు సొంతంగా నేర్చుకునేలా సాధికారికత కల్పిస్తుంది. ఒరిజినల్ కంటెంట్, వాచ్ అండ్లెర్న్ వీడియోలు, యానిమేషన్లు, ఇంటరాక్టివ్ సిములేషన్స్ అందిస్తుంది. వివిధఅంశాలను విద్యార్థులు సులభంగా నేర్చుకునేలా చేయడంలో అవి తోడ్పడుతాయి. 

 బైజూస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మృణాల్మోహిత్ మాట్లాడుతూ, ‘‘బైజూస్ లో ఇది ప్రతి ఒక్కరికీ ఎంతో గర్వనీయ సందర్భం. చిన్నవయస్సులోనే సాధించిన విజయాలకు గాను రిత్విక్ కు మా అభినందనలు. గణితం అనేది ఒక అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్. తగినంత అభ్యసనంతో గణితంను సులభంగా కూడా నేర్చుకోవచ్చు. బైజూస్ లో కంటెంట్ సులభంగా అర్థం చేసుకునేలా అందించబడుతుంది. అంటే విద్యార్థులు ఎక్కువకష్టపడకుండానే తెలిగ్గా ఆయా భావనలను అర్థం చేసుకోగలుగుతారు. రిత్విక్ సాధించినవిజయాలు ఈ భావనల ప్రభావశీలతకు నిదర్శనం’’ అని అన్నారు.  అబాకస్ 2019 రాష్ట్ర స్థాయి ఛాంపియన్, జాతీయ స్థాయిలోసెకండ్ రన్నరప్ బైజూస్ విద్యార్థి అనంత రిత్విక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘బైజూస్లో నేర్చుకోవడం అనేది ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. గణితం అం టే నాకు ఎంతో ఇష్టం.బైజూస్ విద్యార్థిగా నేనెంతో గర్విస్తున్నా. యాప్ లోని వీడియోలు క్లిష్టమైనభావనలను అర్థం చేసుకోవడంలో నాకెంతో తోడ్పడ్డాయి. అదీ సులభంగా, వినోదాత్మకవిధానంలో. మేథమేటిక్స్ లో మా స్టర్ కావాలన్నది నా ఆకాంక్ష. భవిష్యత్ లోగణితశాస్త్రవేత్త కావాలన్నది నా కల. ఈ పోటీల్లో నెగ్గేందుకు నాకు తోడ్పడిన బైజూస్కు నా ధన్యవాదాలు’’ అని అన్నాడు.

 ఆన్ లైన్ డెమో తరగతుల ద్వారా... 

అబాకస్ అంటే రిత్విక్ కు ఆసక్తి ఎందుకు ఏర్పడింది ? రిత్విక్ కు తల్లిదండ్రులు అబాకస్ ను పరిచయం చేయగానే, ఆన్ లైన్ డెమో తరగతుల ద్వారా దాని భావనలను గురించి మరింతగా తెలుసుకోవడం ప్రారంభించాడు. అంకెలను లెక్కిం చేందుకు పూసలతో పాటుగా చేతివేళ్లనూ ఉపయోగించడం ఆరంభించాడు. ప్రాక్టీస్ చేస్తున్న కొ ద్దీ లెక్కలు వేగంగా, మరింత కచ్చితత్వంతో చేయడం మొదలెట్టాడు. రెండు, మూడు నెలల్లో నే రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ లలో పాల్గొనడం ప్రారంభించాడు.

బైజూస్ ఎలా సహకరించింది... ?

వ్యక్తిగతంగా ఉన్నతి సాధించడంలో లేదా తన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంలో రిత్విక్ కు బైజూస్ ఎలా సహకరించింది ? గణితం ను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేలా చేయడం ద్వారా రిత్విక్ అకడమిక్ కెరీర్ లో బైజూస్ ఓ చక్కటి మార్పు తీసుకువచ్చింది. రిత్విక్ రోజూ దాదాపు 2 గంటలు యాప్ పై గడిపేవాడు. సమీప భవిష్యత్ లో గణిత శాస్త్రవేత్త కావాలన్నది ఆయన ధ్యేయం. అబాకస్ ను పరిచయం చేసిన తన తల్లిదండ్రులు, సమగ్ర అభ్యసన ప్రోగ్రామ్ లను అందిస్తున్న బైజూస్ తన విజయానికి కారణమని అంటాడు రిత్విక్. గణితం సులభమైందిగా, తార్కికమైందిగా చేయడంలో అబాకస్ ఎలా తోడ్పడింది?రిత్విక్ కు గణితం అంటే ఇష్టమని, అందులో ఆయనకు చక్కటి ప్రతిభ ఉందని తల్లిదండ్రులు మొదట్లోనే గుర్తించారు.

ఖాళీ సమయంలో... 

ఖాళీ సమయంలో రిత్విక్ అంకెలతో ఆడుకుంటాడు. గణితం పజిల్స్ సాల్వ్ చేస్తుంటాడు. గణితం పాఠ్యపుస్తకంతోనే గరిష్ఠ సమయాన్ని వెచ్చిస్తాడు. దాంతో తల్లి దండ్రులు అబాకస్ ను అతడికి పరిచయం చేశారు. అందులో ఆయన రాణించేలా ప్రోత్సహిం చారు.తీసివేతలు, కూడికలు, భాగహారం, గుణకారం లాంటి గణిత ప్రాథమిక భావనల పట్ల రిత్విక్ ఆ లోచనా ధోరణిని అది ప్రభావితం చేసింది. దాంతో అంకెలను లెక్కించడం సులభంగా, వేగంగా చేసేందుకు అత్యంత సృజనాత్మక విధానంగా రిత్విక్ దాన్ని గుర్తించాడు. 

ఇవి కూడా చదవండి... 

  భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ప్రపంచ రుచుల వేదిక ‘45th ఎవెన్యూ’ ప్రారంభం

ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి