శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 02:23:57

బీహార్‌లో నేడే తొలి విడత

బీహార్‌లో నేడే తొలి విడత

  • 71 స్థానాలకు పోలింగ్‌.. బరిలో 1,066 మంది
  • కరోనా జాగ్రత్తలతో పోలింగ్‌కు సర్వం సిద్ధం

పాట్నా: బీహార్‌ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకున్నది. 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో 71 స్థానాలకు బుధవారం తొలివిడత పోలింగ్‌ జరుగనున్నది. 2.14 కోట్ల మంది ఓటర్లు 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో కొందరు కీలక నేతలు కూడా ఉన్నారు. పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశంలో కరోనా విజృంభించిన తర్వాత జరుగుతున్న భారీ ఎన్నికలు ఇవే కావటంతో వైరస్‌ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 71 నియోజకవర్గాల్లో ఎన్డీఏ సిట్టింగ్‌ స్థానాలు 37 ఉండగా, మహా కూటమివి 34 ఉన్నాయి. మొదటి విడత స్థానాల్లో సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ 35 చోట్ల పోటీ చేస్తుండగా, మిత్రపక్షం బీజేపీ 29 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ 42 చోట్ల పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ 20 చోట్ల పోటీ పడుతున్నది.