శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 26, 2020 , 16:07:44

శుభవార్త..కరోనా టీకా క్లినికల్‌ ట్రయల్స్‌లో పురోగతి

శుభవార్త..కరోనా టీకా క్లినికల్‌ ట్రయల్స్‌లో పురోగతి

న్యూ ఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను ఎదుర్కొనే టీకా సిద్ధమవుతోంది. హర్యానా రాష్ట్రంలోగల పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ (పీజీఐ)లో ‘కొవాగ్జిన్‌’ అనే టీకా మొదటి దశ క్లినికల్‌ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తైనట్లు ట్రయల్‌ టీం ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ సవితావర్మ వెల్లడించారు. ఫేస్‌ -1లో రెండో భాగం కింద శనివారం మొత్తం ఆరుగురికి టీకా వేసినట్లు ఆమె చెప్పారు.

‘టీకా ట్రయల్‌ ఫేస్‌ -1లో మొదటి భాగం పూర్తయింది. భారతదేశం అంతటా 50 మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. శనివారం రెండో భాగం కింద ఆరుగురికి వ్యాక్సిన్ ఇచ్చారు.’ అని సవితావర్మ వివరించారు. కొవాగ్జిన్‌ను కరోనాను ఎదుర్కొనేందుకు తయారవుతున్న దేశ మొదటి టీకాగా భావిస్తున్నారు. ఈ టీకా మొదటి హ్యుమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జూలై 17న పీజీఐ రోహతక్‌లో ప్రారంభమయ్యాయి. ఆ రోజు ముగ్గురు వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo