బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 16:49:39

వైట్‌ డ్రెస్‌లో.. మెరిసిన‌ మెలానియా

వైట్‌ డ్రెస్‌లో.. మెరిసిన‌ మెలానియా

అహ్మదాబాద్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ తళుక్కున మెరిసిపోయారు. విమానం నుంచి దిగుతున్న మెలానియా ట్రంప్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్రంప్‌ నలుపు రంగు షూట్‌ ధరించగా.. మెలానియా మాత్రం తెలుపు రంగు దుస్తులను ధరించి.. అందరినీ ఆకర్షింపజేశారు. మెలానియా ధరించిన వస్ర్తాలను అమెరికన్‌ డిజైనర్‌ రాచెల్‌ రాయ్‌ డిజైన్‌ చేశారు. ముఖ్య విషయం ఏంటంటే.. 2015లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత పర్యటనకు వచ్చారు. అప్పుడు ఒబామా సతీమణి మిషెల్లీ  ఒబామా కూడా భారత్‌ వచ్చారు. ఆ సమయంలో కూడా మిషెల్లీ  ఒబామా వస్ర్తాలను రాచెల్‌ రాయే డిజైన్‌ చేశారు. ఇక అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన ట్రంప్‌ దంపతులకు రెడ్‌కార్పెట్‌పై మోదీ ఘనస్వాగతం పలికారు. 


logo