త్వరలోనే ఫ్లోటింగ్ అంబులెన్స్ సేవలు ప్రారంభం

జమ్ముకశ్మీర్ : శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో త్వరలోనే ఫ్లోటింగ్ అంబులెన్స్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీనిపై బోటు యజమాని తారిక్ అహ్మద్ పట్లూ స్పందిస్తూ.. తాను కొవిడ్ భారిన పడ్డప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాలేదన్నారు. తన స్నేహితుడే బోటు ఏర్పాటు చేసి ఆస్పత్రికి చేరవేశాడన్నారు. ఇది తననెంతో బాధించిందని అప్పుడే ఫ్లోటింగ్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
బోటులో పలు వైద్య సదుపాయాలతో(ఆక్సిజన్ సిలిండర్, ఈసీజీ, ఆక్సిమీటర్, వీల్‌చైర్, స్ట్రెచర్) పాటు టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫ్లోటింగ్ అంబులెన్స్ సేవలు స్థానికులకు నిజంగా అవసరమన్నారు. దాల్ సరస్సు వెంబడి స్థానికంగా నివసించే వేల మందికి ఇది ఎంతో ఉపయోగపడనున్నట్లు తెలిపారు. అంబులెన్స్ బోటు మెకానిక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. చెక్క, ఇనుమును ఉపయోగించి 35 అడుగుల పొడవైన బోటును తయారుచేసినట్లు తెలిపాడు. మధ్య ఆరు అడుగుల స్పేస్ ఉంటుందన్నాడు. మూడు, నాలుగు నిమిషాల ముందు తీసుకువస్తే ప్రాణాపాయం తప్పేదని వైద్యులు చెప్పిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు.
ఈ ఫ్లోటింగ్ అంబులెన్స్‌తో రోగులను సకాలంలో ఆస్పత్రికి చేర్చవచ్చన్నారు. టూరిస్ట్ సీజన్లో సైతం ఎంతో భాగా ఉపయోగపడనున్నట్లు తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారని ఎవరైనా అస్వస్థతకు గురైతే వారికి తక్షణ చికిత్స అవసరం ఉంటుందన్నారు. ఫ్లోటింగ్ అంబులెన్స్‌తో తాము అటువంటి వారికి వెనువెంటనే ప్రాథమిక చికిత్స అందజేయనున్నట్లు పేర్కొన్నాడు.
తాజావార్తలు
- హెచ్-1బీ కోసం ఓపీటీ దుర్వినియోగం: దర్యాప్తుకు అమెరికా సిద్ధం!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- భద్రాద్రి కొత్తగూడెంలో తొలిసారిగా బాలల అదాలత్
- ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- దాహం తీర్చే యంత్రం.... వచ్చేసింది..!
- కామెడీ టచ్‌తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన
- వైట్‌హౌస్‌కు ఆ పేరెలా వచ్చింది.. దాని చరిత్ర గురించి మీకు తెలుసా!
- డిసెంబర్లో వాట్సాప్ పేమెంట్స్ రెట్టింపు: టాప్‌లోనే ఫోన్‌పే
- శశికళకు నో ఛాన్స్ : సీఎం పళనిస్వామి