శుక్రవారం 05 జూన్ 2020
National - May 10, 2020 , 15:58:18

లండన్‌ నుంచి ముంబై చేరిన భారతీయులు

లండన్‌ నుంచి ముంబై చేరిన భారతీయులు

ముంబై : కొవిడ్‌-19 నేపథ్యంలో లండన్‌లో చిక్కకుపోయిన భారతీయులను రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా మొదటి తరలింపు ఎయిరిండియా విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం రెండు గంటలకు దిగింది. ఈ విమానం శనివారం లండన్‌ నుంచి బయల్దేరింది. లండన్‌ నుంచి బయల్దేరిన ఈ విమానంలో 326 మంది భారతీయులు ఉన్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన  భారతీయును స్వదేశానికి రప్పించేందుకు వందే భారత్‌ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం ప్రకటించింది. మే 7 వ తేదీ నుంచి వారం రోజులపాటు దాదాపు 64 విమానాలను ఇందుకోసమే నడుపనున్నట్టు కేంద్ర ప్రభుత్వం  తెలిపింది. గల్ఫ్‌ దేశాలు సహా బ్రిటన్‌, బంగ్లాదేశ్‌, మలేషియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఇంటికి చేర్చేందుకు వందే భారత్‌ మిషన్‌ పనిచేస్తున్నది.


logo