గురువారం 28 మే 2020
National - May 10, 2020 , 07:19:13

లండన్‌ నుంచి ముంబై చేరిన 326 మంది

లండన్‌ నుంచి ముంబై చేరిన 326 మంది

ముంబై: వందే భారత్‌ మిషన్‌ భాగంగా లండన్‌ నుంచి వచ్చిన మొదటి విమానం ముంబైలో దిగింది. 326 మంది భారతీయులతో  శనివారం లండన్‌ నుంచి బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టుకు చేరింది. విదేశాల్లో చిక్కుకున్న ఎన్‌ఆర్‌ఐలను దశలవారీగా ఈ నెల 7 నుంచి స్వదేశానికి తరలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్‌తో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 15 వేల మంది భారతీయులను తిరిగి తీసుకురావడానికి మే 7 నుంచి 13 వరకు భారత ప్రభుత్వం 64 విమానాలను నడపనుంది. మొదటి దశ వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ఇప్పటికే గల్ఫ్‌ దేశాలు, యూకే, బంగ్లాదేశ్‌, మలేషియా నుంచి ఎన్‌ఆర్‌ఐలు తరలి వచ్చారు.


logo