దేశ రాజధాని ఢిల్లీకి చేరిన కొవిషీల్డ్ వ్యాక్సిన్

న్యూఢిల్లీ : ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభంకానున్న నేపథ్యంలో పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి దేశంలోని పలు నగరాలకు మంగళవారం వ్యాక్సిన్‌ను తరలించారు. ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఇండిగో, గో ఎయిర్ విమాన సంస్థలు వ్యాక్సిన్లను పుణె నుంచి ఆయా ప్రాంతాలకు తరలించాయి. 56.5లక్షల కొవిడ్-19 వ్యాక్సిన్లను దేశంలోని 13 నగరాలకు నాలుగు విమానయాన సంస్థలు తొమ్మిది విమానాలు నడుపుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా దేశ రాజధాని ఢిల్లీకి కూడా చేరించింది. సరుకు 34 బాక్సులు 1088 కిలోల బరువున్న వ్యాక్సిన్‌ను స్పైస్ జెట్ ఢిల్లీకి తరలించింది. ఈ సందర్భంగా స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ మాట్లాడుతూ గువాహటి, కోల్‌కతా, హైదరాబాద్, భువనేశ్వర్, బెంగళూరు, పాట్నా, విజయవాడ సహా పలు భారతీయ నగరాలకు వ్యాక్సిన్‌ను తరలిస్తామని చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో, వెలుపల రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ఈ రోజు సుదీర్ఘమైన, నిర్ణయాత్మక దశకు నాంది పలికిందని, స్పైస్‌జెట్ మానవజాతి చరిత్రలో అతిపెద్ద టీకా డ్రైవ్‌కు సహాయపడటంలో తమకు గర్వంగా ఉందన్నారు.
తాజావార్తలు
- యూకేలో జూలై 17 వరకు లాక్డౌన్ పొండగింపు
- పెళ్లికి ముందు కారు యాక్సిడెంట్ చేసిన వరుణ్
- మల్లేపల్లి ఐటీఐలో రేపు జాబ్‌మేళా
- తరగతులు.. 16 వారాలే...
- వేలానికి నేతాజీ ఫండ్ రసీదు..
- ఫోన్.. ప్రాణం తీసింది
- భద్రత, రక్షణపై మహిళల్లో చైతన్యం
- శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
- మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించిన సోనూసూద్
- శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్