సోమవారం 06 జూలై 2020
National - Jun 25, 2020 , 17:58:18

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో తొలి క‌రోనా మ‌ర‌ణం

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో తొలి క‌రోనా మ‌ర‌ణం

ఇటా న‌గ‌ర్ : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ర్టంలో తొలి క‌రోనా మ‌ర‌ణం న‌మోదైంది. 43 ఏళ్ల మ‌హిళ క‌రోనా వైర‌స్ కార‌ణంగా మృతి చెందిన‌ట్లు ఆ రాష్ర్ట వైద్యాధికారులు గురువారం ప్ర‌క‌టించారు. వెస్ట్ కామేంగ్ జిల్లాకు చెందిన మ‌హిళ‌.. గ‌త కొంత‌కాలం నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ ప‌డుతోంది. జూన్ 11న ఆమె ఢిల్లీ నుంచి అరుణాచ‌ల్ కు తిరిగొచ్చింది. దీంతో ఆమెను క్వారంటైన్ సెంట‌ర్ లో ఉంచారు. మ‌హిళ ఆరోగ్యం క్షీణించ‌డంతో.. జూన్ 23న క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆమెకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.  

దీంతో బాధితురాలిని న‌హ‌రాల్గ‌న్ లోని టోమో రిబా ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. మార్గ‌మ‌ధ్య‌లోనే క‌న్నుమూసింది. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం మ‌హిళ మృత‌దేహానికి దిరాంగ్ లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.  

మ‌హిళ మృతితో పాటు మ‌రో రెండు పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 160 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు అధికారులు తెలిపారు.  ఇందులో 121 కేసులు యాక్టివ్ ఉండ‌గా, 38 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. చంగ్లాంగ్ జిల్లాలో అత్య‌ధికంగా 60 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  


logo