గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 19:46:55

ఏపీలో మొదటి కరోనా పాజిటీవ్‌ కేసు

ఏపీలో మొదటి కరోనా పాజిటీవ్‌ కేసు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కరోనావైరస్‌ పాజిటీవ్‌ కేసు నమోదైంది. ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈ విషయాన్ని గురువారం అమరావతిలో దృవీకరించారు. నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 6వ తేదీన ఇటలీ నుంచి తిరిగి వచ్చాడు. పొడిదగ్గు కారణంగా నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల నిమిత్తం రక్త నమూనాలను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ మెడికల్‌ సైన్సెన్స్‌కు పంపించారు. ఈ పరీక్షలో కోవిడ్‌-19 పాజిటీవ్‌గా వచ్చినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వ్యాధి లక్షణాల నుంచి అతను కోలుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. 14 రోజుల అనంతరం తిరిగి పరీక్షలు నిర్వహించి డిశ్చార్జి చేయనున్నట్లు తెలిపారు. కాగా సదరు వ్యక్తితో కలిసిన మరో ఐదుగురి వ్యక్తులను క్వారంటైన్‌కు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు.


logo