శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 14:00:20

విజయవాడ నగరంలో మొదటి కరోనా పాజిటీవ్‌

విజయవాడ నగరంలో మొదటి కరోనా పాజిటీవ్‌

విజయవాడ: విజయవాడ నగరంలో మొదటి కరోనా పాజిటీవ్‌ కేసు నమోదైనట్లు కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఎ.ఎండీ ఇంతియాజ్‌ తెలిపారు. దీనికి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. కరోనా పాజిటీవ్‌ కేసు నమోదైన ప్రాంతంలో దాదాపు 500 ఇళ్లలో మెడికల్‌ చెకప్‌లు చేశాం. మూడు కిలోమీటర్ల మేర వరకు ప్రజలను అప్రమత్తం చేశాం. ఎరవెవరిని కలిశారో వారిని ఇంట్లో వారివి శాంపిల్స్‌ సేకరించాం. ప్రైవేటు టాక్సీలో వచ్చిన వ్యక్తిని కూడా పరిశీలిస్తున్నాం. ప్రైవేటు క్యాబ్‌లో హైదరాబాద్‌ నుంచి విజయవాడ, అక్కడి నుంచి గుంటూరుకు ముగ్గురు ప్యాసింజర్లను తీసుకువచ్చారు. అనుమానం ఉన్నవారు మా కంట్రోల్‌రూంకు కాల్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. 


logo