ఆదివారం 07 జూన్ 2020
National - Apr 02, 2020 , 12:31:45

హ‌రియాణ‌లో తొలి క‌రోనా మ‌ర‌ణం

హ‌రియాణ‌లో తొలి క‌రోనా మ‌ర‌ణం

భార‌త్‌లోనూ వేగంగా క‌రోనా మ‌హమ్మారి వ్యాప్తిచెందుతుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. కాగా హ‌రియ‌ణా రాష్ట్రంలో తొలి క‌రోనా మ‌ర‌ణం న‌మోద‌యింది. అంబాలాలో క‌రోనాతో 67 ఏండ్ల వ్య‌క్తి మృతిచెందాడు.  మ‌హారాష్ట్రంలో కొత్త‌గా మ‌రో మూడు క‌రోనా పాజిట‌వ్ కేసులు నమోద‌య్యాయి. దీంతో మ‌హారాష్ట్రలో 338కి బాధితుల సంఖ్య చేరింది. అటు క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా న‌మోదైన 11 కేసుల్లో ఢిల్లీ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లివ‌చ్చిన వారే కావ‌డం విశేషం. వీరంతా బీద‌ర్ జిల్లాకు చెందిన వారు. క‌ర్ణాట‌క‌లో క‌రోనా కేసుల సంఖ్య 121కి చేరింది. రాజ‌స్థాన్‌లో కొత్త‌గా 9, మొత్తం 129, ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మ‌రొక‌రు మృతిచెందారు. ఇండోర్‌లో 65 ఏండ్ల వృద్ధురాలు మ‌ర‌ణించింది. దీంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మ‌ర‌ణాల సంఖ్య 7కి చేరుకుంది. ఇక గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో 52 ఏండ్ల వ్య‌క్తి క‌రోనాతో మృతి చెందాడు. గుజ‌రాత్‌లో మృతిచెందిన‌వారి సంఖ్య 7కి చేరింది.

 <p>ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి<font color="#ff0000"> ..<b> <a href="https://t.me/NamastheTelangana" target="_blank">టెలిగ్రామ్</a></b></font><b> </b>యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..<br></p>logo