సోమవారం 25 జనవరి 2021
National - Nov 29, 2020 , 12:05:09

మతమార్పిడి నిరోధక చట్టం కింద తొలికేసు నమోదు

మతమార్పిడి నిరోధక చట్టం కింద తొలికేసు నమోదు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్, 2020 కింద తొలి కేసు నమోదైంది. డియోరానియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గం నవంబర్‌ 24న చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్‌ - 2020కు ఆమోదం తెలుపగా.. ఈ ఆర్డినెన్స్‌కు  గవర్నర్ ఆనందిబెన్ పటేల్ శనివారం ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆర్డినెన్స్ ప్రకారం డియోరానియా పోలీస్ స్టేషన్‌లో తొలి కేసు నమోదైంది. ఓ మహిళను మతం మారాలంటూ ఒత్తిడి చేయగా.. పోలీసులను ఆశ్రయించింది. ‘లవ్‌ జిహాద్‌’ సంబంధిత నేరాలకు గరిష్ఠంగా పదేళ్ల శిక్ష వేయనున్నారు. ప్రస్తుతం సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడు. పెళ్లి కోసం మతం మారాలంటూ నిర్బంధించేవారికి ఒక ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.15వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. మైనర్లను, ఎస్సీ, ఎస్టీ మహిళలను చట్ట విరుద్ధంగా మతం మార్చేవారికి మూడు సంవత్సరాల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 


logo