ఆదివారం 31 మే 2020
National - May 09, 2020 , 16:12:20

కువైట్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం

కువైట్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా వందే భారత్‌ మిషన్‌ను ప్రారంభించింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక తొలి ఎయిరిండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లింది. కువైట్‌ నుంచి వచ్చేందుకు ఇప్పటికే చాలా మంది సిద్ధమవగా, తొలి విమానంలో 155 మందిని హైదరాబాద్‌ తీసుకురానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు కువైట్‌ చేరుకొన్న విమానం.. ప్రయాణికులతో కలిసి రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ రానున్నదని ఎయిరిండియా అధికారులు తెలిపారు.


logo