గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 11:10:45

ఫ్రాన్స్ నుంచి ఇవాళే బ‌య‌లుదేర‌నున్న రాఫెల్ యుద్ధ విమానాలు

ఫ్రాన్స్ నుంచి ఇవాళే బ‌య‌లుదేర‌నున్న రాఫెల్ యుద్ధ విమానాలు

హైద‌రాబాద్‌:  ఫ్రాన్స్ నుంచి ఇవాళ అయిదు రాఫెల్ యుద్ధ విమానాలు భార‌త్‌కు బ‌య‌లుదేరి రానున్నాయి. ఇస్‌ట్రెస్ ఎయిర్‌బేస్ నుంచి ఆ విమానాలు గాలిలోకి ఎగ‌ర‌నున్నాయి.  భార‌తీయ వాయుసేన‌కు చెందిన పైల‌ట్లు ఆ యుద్ధ విమానాల‌ను న‌డ‌ప‌నున్నారు.  యూఏఈలోని అల్ ద‌ఫ్రా ఎయిర్‌బేస్‌లో రాఫెల్ జెట్ విమానాలు.. బ్రేక్ స్టాప్ తీసుకోనున్నాయి. ఆ త‌ర్వాత బుధ‌వారం రోజున అంబాలా ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు రాఫెల్ విమానాలు చేరుకుంటాయి. ఫ్రాన్స్ నుంచి అంబాలాకు సుమారు 7364 కిలోమీట‌ర్లు ఈ యుద్ధ విమానాలు ప్ర‌యాణిస్తాయి. 

ఫ్రాన్స్‌తో మొత్తం 36 యుద్ధ‌విమానాల‌కు ఒప్పందం కుదిరిన విష‌యం తెలిసిందే. రాఫేల్ యుద్ధ విమానాల్లో ఎగిరేందుకు భార‌త వాయు సేన‌కు చెందిన 12 మంది పైల‌ట్లు ఫ్రాన్స్‌లోనే శిక్ష‌ణ పొందారు. మ‌రికొంత మంది అడ్వాన్స్‌డ్ ద‌శ‌లో ట్రైనింగ్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. మొత్తం 36 మంది ఐఏఎఫ్ పైల‌ట్ల‌కు ఫ్రాన్స్ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ది.   
logo