శనివారం 15 ఆగస్టు 2020
National - Mar 25, 2020 , 09:07:07

మొద‌ట క‌రోనా పాజిటివ్.. 2 వారాల త‌ర్వాత నెగిటివ్

మొద‌ట క‌రోనా పాజిటివ్.. 2 వారాల త‌ర్వాత నెగిటివ్

ముంబ‌యి : మ‌హారాష్ర్ట‌లో క‌రోనా కేసులు అత్య‌ధికంగా న‌మోదవుతున్న విష‌యం విదిత‌మే. అక్క‌డ తొలిసారిగా న‌మోదైన రెండు క‌రోనా కేసులు.. ఇప్పుడు సాధార‌ణ స్థితికి వ‌చ్చాయి. పుణెలో తొలిసారిగా రెండు వారాల క్రితం ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వారిద్ద‌రిని ఐసోలేష‌న్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. రెండు వారాల త‌ర్వాత వారిద్ద‌రికి మ‌రోసారి కరోనా టెస్టులు నిర్వ‌హించ‌గా, నెగిటివ్ వ‌చ్చింది. ఇద్ద‌రు వ్య‌క్తులు ఇప్పుడు కోలుకున్నారు. వీరిద్ద‌రిని ఇవాళ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేస్తామ‌ని పుణె మున్సిపాలిటీ ప‌బ్లిక్ రిలేష‌న్ ఆఫీస‌ర్ మీడియాకు వెల్ల‌డించారు. మ‌హారాష్ర్ట‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 107 కరోనా కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే ఆరుగురికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. భార‌త్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 536 క‌రోనా కేసులు న‌మోదు అయిన‌ట్లు ఐసీఎంఆర్ వెల్ల‌డించింది. 


logo