శనివారం 04 జూలై 2020
National - Jun 21, 2020 , 12:03:03

8 రోజుల్లో లక్ష మందికి కరోనా

8 రోజుల్లో లక్ష మందికి కరోనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత మరింతగా పెరుగుతున్నది. ఆదివారం నాటికి కేసుల సంఖ్య నాలుగు లక్షల మార్కును దాటి 4,10,461కి చేరింది. జనవరి 30న దేశంలో తొలి వైరస్ కేసు వెలుగుచూడగా మార్చిలో తొలి లక్ష మార్కు చేరేందుకు 78 రోజుల సమయం పట్టింది. అనంతరం కరోనా విజృంభన మరింత పెరిగింది. కేవలం 15 రోజుల్లోనే 2 లక్షల మార్కును చేరగా, అనంతరం పది రోజుల్లో కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. తాజాగా 8 రోజుల్లోనే కొత్తగా లక్ష వైరస్ కేసులు నమోదు కాగా ఈ సంఖ్య నాలుగు లక్షలను దాటింది.
దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో మే 19 నుంచి జూన్ 20 వరకు నమోదైన కేసులే 75 శాతంపైగా ఉన్నాయి. అంటే సుమారు నెల రోజుల్లో దేశవ్యాప్తంగా కేసుల నమోదు మూడు రెట్లు పెరిగింది. ఈ నెల రోజుల్లో కరోనా పరీక్షల రేటు 4.6 శాతం నుంచి 7.8 శాతానికి పెరిగింది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో 1,89,869 కరోనా పరీక్షలు జరిపినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.


logo