గురువారం 04 జూన్ 2020
National - May 16, 2020 , 17:36:20

రెంటు అడిగిన ఇంటి యజమానులపై కేసులు

రెంటు అడిగిన ఇంటి యజమానులపై కేసులు

న్యూఢిల్లీ: రెంటు అడిగిన ఇంటి యజమానులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటి అద్దె చెల్లించాల్సిందేనంటూ బలవంతపెట్టిన 10 మంది ఇంటి యజమానులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన ఇంటి ఓనర్లలో నార్త్‌వెస్ట్‌ జిల్లాలోని ముఖర్జినగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తొమ్మిది మంది, సౌత్‌ వెస్ట్‌ జిల్లాలో ఒకరు ఉన్నారని వెల్లడించారు. లాక్‌డౌన్‌లోనూ ఇంటి యజమానులు తమపై అద్దెల కోసం ఒత్తిడి చేస్తున్నారని ముఖర్జినగర్‌ పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు పీజీ విద్యార్థులు, ఇతరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ ఇంటి అద్దెల కోసం ఒత్తిడి చేయొద్దని, ఎవరైనా ఇంటి అద్దెలు చెల్లించలేకపోతే లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుత్వమే చెలిస్తుందని గత మార్చిలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ ఇంటి యజమానులను ఉద్దేశించి ప్రకటన చేశారు. అయినా ఎవరైనా అద్దెల కోసం ఒత్తిడి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 


logo