సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 07:14:52

జమ్మూలోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు

జమ్మూలోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు

అనంతనాగ్‌ : జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లోని ఖుల్‌చోహార్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలంలో ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. అంతకుముందు జూన్ 26న భద్రతా దళాలు ట్రాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. చేవా ఉల్లార్ గ్రామంలో గుర్తు తెలియని ఉగ్రవాదులు ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి భద్రతా దళాలు సమాచారం అందుకున్న తరువాత ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo