బుధవారం 27 జనవరి 2021
National - Dec 24, 2020 , 03:45:15

త్రివిధ దళాల్లో ‘అగ్నివీరులు’!

త్రివిధ దళాల్లో ‘అగ్నివీరులు’!

న్యూఢిల్లీ: ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’... భారత సైన్యంలో నియామకాల కోసం ఇటీవల ప్రతిపాదించిన కొత్త పద్ధతి. దీని ఉద్దేశం... యువతకు తాత్కాలికంగా మూడేండ్ల పాటు సైన్యంలో పనిచేసే అవకాశం కల్పించడం.  ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’ని ‘అగ్నిపథ్‌'గా, ఈ పద్ధతిలో నియమితులయ్యే వారిని ‘అగ్నివీరులు’గా వ్యవహరించే అంశం పరిశీలనలో ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఆర్మీతో పాటు నౌకాదళం, వాయుసేన కూడా ఇప్పుడు ఈ పద్ధతిని అనుసరించడానికి మొగ్గు చూపుతున్నాయి. ఆర్మీ విషయానికొస్తే... టూర్‌ ఆఫ్‌ డ్యూటీ విధానంలో మొదటి విడుతలో 100 మంది అధికారులు, ఇతర ర్యాంకుల్లో 1000 మందిని నియమించాలని యోచిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో సైన్యంలో 40 శాతం బలగాలను ఈ విధానంలోనే నియమించేలా ప్రణాళిక రచిస్తున్నట్టు సమాచారం. దీని వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు ఆర్మీపై పెన్షన్ల భారం తగ్గుతుందని భావిస్తున్నారు.


logo