న్యూఢిల్లీ: బంగారు గొలుసును చీమలు దొంగిలించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అదేమిటి చీమలు బంగారం గొలుసును దొంగిలించడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని చీమలు కలిసి ఒక బంగారు గొలుసును తీసుకెళ్తుంటాయి. ఈ వీడియోకు స్మాలెస్ట్ గోల్డ్ స్మగ్లర్స్ అని ఆయన పేరు పెట్టారు.
మరోవైపు 15 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో నవ్వులు పూయించడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బంగారం దొంగతనం చేసే ఈ చీమలపై నెటిజన్లు పలు సెటైర్లు వేశారు. ఈ దొంగ చీమలను అరెస్ట్ చేశారా లేక అవి తప్పించుకున్నాయా, ఏ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు అంటూ కొందరు హాస్యమాడారు.