శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 17, 2021 , 09:54:09

మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు

మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు

తిరువనంతపురం : మంగళూరు-తిరువనంతపురం మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలు పార్శిల్ వ్యాన్‌లో మంటలు చెలరేగాయని రైల్వే వర్గాలు తెలిపాయి. మంటలు వ్యాపించడంతో వెంటనే అప్రమత్తమై ప్రయాణికులందరినీ దింపి వేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వర్కోలా, పరపూర్‌ స్టేషన్ల మధ్య ఎడావ వద్ద ఉదయం 7.40 గంటల సమయంలో లోకో పైలట్ రైలు ముందు భాగంలోని పార్శిల్ వ్యాన్‌లో నుంచి పొగరావడం గుర్తించారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. మంటలు పార్సెల్ వ్యాన్‌కు పరిమితం కాగా, మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

VIDEOS

logo