గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 17:25:33

కరోనా దవాఖానలో అగ్ని ప్రమాదం.. మరో ఆసుపత్రికి రోగుల తరలింపు

కరోనా దవాఖానలో అగ్ని ప్రమాదం.. మరో ఆసుపత్రికి రోగుల తరలింపు

భువనేశ్వర్: కరోనా దవాఖానలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అందులోని రోగులను మరో ఆసుపత్రికి తరలించారు. ఒడిశాలోని కటక్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది.   జగత్‌పూర్‌లోని సద్గురు కోవిడ్ ఆసుపత్రిలో మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి సిబ్బంది, రోగులు భయంతో పరుగులు తీశారు. మరోవైపు దవాఖానలోని కరోనా రోగులను అంబులెన్స్‌లలో మరో దవాఖానకు తరలించారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణమంతా అంబులెన్స్‌లతో నిండిపోయింది. పోలీసులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని సమాచారం. మరోవైపు దవాఖానలో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య 1.84 లక్షలకు చేరగా ఇప్పటి వరకు 700 మందికిపైగా మరణించారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo